MLA Gudem Mahipal reddy | పటాన్ చెరు, అక్టోబర్ 26 : అమీన్ పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఆర్టీసీ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాలనీల మధ్య అంతర్గత రహదారులు నిర్మిస్తూ.. మెరుగైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు మహదేవరెడ్డి, కొల్లూరి మల్లేష్, గోపాల్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్ పూర్ గ్రీన్ మెడోస్ కాలనీలో ఘనంగా రామాలయం భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ప్రజలలో భక్తి భావం పెంపొందించేందుకు నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో నూతనంగా నిర్మించతలపెట్టిన రామాలయం భూమి పూజ, కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
రామాలయం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి , మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.
Read Also :
Jigris Release Announcement | విడుదల తేదీని ప్రకటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్