Peddi First Single | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శ్రీలంకలో రొమాంటిక్ సాంగ్ షూటింగ్లో ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మొదటి సింగిల్‌ను రాబోయే 10-15 రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ నవంబర్ 8న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే ‘ది వండర్మెంట్ హైదరాబాద్’ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘పెద్ది’ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావచ్చని తెలుస్తుంది. ఈ ఈవెంట్ ప్రమోషన్స్‌లో ‘మెగా కాన్సర్ట్’ అని పేర్కొనడంతో మెగా అభిమానుల ఆశలు మరింత రెట్టింపయ్యాయి. ‘పెద్ది’ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకుడు కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్, ఏఆర్ రెహమాన్ సంగీతంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.