Nara Rohith | టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. ప్రతినిధి 2 చిత్రంలో హీరోయిన్గా నటించిన సిరి లెల్లను తన జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్న రోహిత్, అక్టోబర్ 30వ తేదీన రాత్రి 10:35 గంటలకు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. ఈ వేడుక హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరగనుంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు జరుగనున్నాయి. అక్టోబర్ 25న హల్దీ వేడుకతో ప్రారంభం రానుండగా, అక్టోబర్ 26న సంప్రదాయ పెళ్లికొడుకు కార్యక్రమం, అక్టోబర్ 28న మెహందీ వేడుక జరగనుంది.
శనివారం నారా రోహిత్, సిరిల హల్దీ వేడుక జరగగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బంధువులు, సన్నిహితుల నడుమ ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు పెళ్లి వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 13న నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ వేడుకలో రోహిత్ తల్లిదండ్రులు, సోదరుడు మంత్రి నారా లోకేశ్, పెద్దమ్మ నారా భువనేశ్వరి, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణలు పాల్గొన్నారు. అయితే, డిసెంబర్లో వివాహం జరగాల్సి ఉండగా, రోహిత్ తండ్రి అకస్మాత్తుగా నవంబర్ 16న కన్నుమూశారు. దీంతో పెళ్లి వాయిదా పడింది.
నారా రోహిత్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు. టాలీవుడ్లో ఆయన బాణం సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్. ప్రతినిథి 2 చిత్ర షూటింగ్ సమయంలో నారా రోహిత్ , సిరి లేళ్ల మధ్య ప్రేమమొదలు కాగా, ఆ తర్వాత వారు పెద్దలను ఒప్పించి వారి ప్రేమను పెళ్లి పీటలకు తీసుకొచ్చారు.
Glimpses from the vibrant #Haldi ceremony of #NaraRohith & #SireeLella 💛
A celebration filled with joy, love, and laughter!@IamRohithNara pic.twitter.com/Dm9Hxh62WG— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 26, 2025