Voters Day | జహీరాబాద్ , జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని జహీరాబాద్ ఆర్డీవో దేవుజ, మున్సిపల్ కమిషనర్ జే తురంలు అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం అన్నారు. ప్రభుత్వాలు, పాలకులను మార్పు చేసే శక్తి ఓటుకుంది. అటువంటి విలువైన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అర్హులైన వారంతా ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నారు. 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపించిన రోజును గుర్తుచేసుకుంటూ ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేయడం, ఓటింగ్ ప్రాముఖ్యత తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ్, పలు శాఖల అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
T20 World Cup | పాకిస్తాన్కు ఐసీసీ వార్నింగ్.. తోక ముడిచిన పాక్.. టీ20 జట్టు ప్రకటన
Narsapur | చిత్తారమ్మ దేవి ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లిన దుండగులు