సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 10గంటల వరకు బాలానగర్, ఫతేనగర్, బోయిన్పల్లి, నాంపల్లి, గన్‌ఫౌండ్రి, విజయనగర్ కాలనీ, తిరుమలగిరి, మూసాపేటలో 4మి.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ద్రోణి ప్రభావంతో రాగల మరో 48 గంటల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.మరో పక్క పగలు సమయంలో ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.0, కనిష్ఠం 3.5 డిగ్రీలు నమోదైంది.