Bhuvneshwar Kumar | అవకాశమిస్తే వద్దంటానా?.. ప్రపంచకప్ కోసం సిద్ధంగా ఉన్నా..!
Bhuvneshwar Kumar : వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కూర్పుపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపత్యంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) తాను ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నానని తెలిపాడు.
Bhuvneshwar Kumar : వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కూర్పుపై కసరత్తు జరుగుతోంది. బ్యాటింగ్ కాంబినేషన్ల నుంచి పేస్ దళంలో ఎవరెవరు ఉండాలి? అనే విషయమై అటు సెలెక్టర్లు.. ఇటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతం గంభీర్‌లు సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపత్యంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) తాను ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నానని తెలిపాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఇరగదీస్తున్న అతడు.. మెగా టోర్నీలో ఆడేందుకు వంద శాతం సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాట బయటపెట్టాడు.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలకమవుతున్న భువనేశ్వర్ కుమార్ భారత జట్టుకు ఆడాలని కలగంటున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027లో తనుకు అవకాశమిస్తే చెలరేగిపోతానని వెల్లడించాడీ వెటరన్ పేసర్. ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో లక్నో ఫాల్కన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్.. వరల్డ్‌కప్‌లో అవకాశమిస్తే ఆడుతారా? అనే ప్రశ్నకు ‘ఔను’ అని బదులిచ్చాడు. ‘నేను ఎందుకు నో చెబుతాను. సెలెక్టర్లు అవకాశం ఇవ్వాలేగానీ మెగా టోర్నీలో ఆడేందుకు నేను వంద శాతం సిద్ధంగా ఉన్నా’ అని స్వింగ్ కింగ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ 121 వన్డేలు ఆడిన అతడు 141 వికెట్లు పడగొట్టాడు.
Bhuvneshwar Kumar on his India comeback 🗣️#Cricket #TeamIndia
pic.twitter.com/ZSbZaaIV3M— CREX (@Crex_live) August 10, 2026
నాలుగేళ్ల క్రితం
చివరిసారిగా నాలుగేళ్ల క్రితం(2022 నవంబర్) భారత జట్టు జెర్సీ వేసుకున్న భువి.. పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆడేసి.. విడ్కోలు పలకాలని భావిస్తున్నాడీ స్వింగ్ సుల్తాన్. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమవుతున్నందున.. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్‌ను ఎంపిక చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

అయితే.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు మాత్రం సిరాజ్‌తో పాటు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రానా, గుర్నూర్ బ్రార్.. వంటి పేసర్లకు వరసగా అవకాశాలిస్తున్నారు. కానీ, ఫామ్.. ఫిట్నెస్ పరంగా ఎంతో మెరుగైన భువనేశ్వర్‌ను వన్డే ప్రపంచకప్‌లో ఆడిస్తే టీమిండియాకు ఎంతో మేలు అంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికగా అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రపంచకప్ మొదలవ్వనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

