పనులు నిలిపేస్తాం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో నిర్వహణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, లేనిపక్షంలో జీహెచ్ఎంసీలో నిర్వహిస్తున్న మౌలిక సదుపాయాల పనులను నిలిపివేస్తామని హెచ్చరించారు.
- జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కాంట్రాక్టర్ల అల్టిమేటం
సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో నిర్వహణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, లేనిపక్షంలో జీహెచ్ఎంసీలో నిర్వహిస్తున్న మౌలిక సదుపాయాల పనులను నిలిపివేస్తామని హెచ్చరించారు.సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు సాయి కిరణ్, హనుమంత్ సాగర్, భాస్కర్‌రావు, మల్లేశ్, శివకుమార్, పన్నాల రాజేందర్ రెడ్డి, శంకర్, శ్రీశైలం, యాదగిరి, వేముల రాఘవేందర్ కలిసి వినతిపత్రం అందజేశారు.
తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఉగాది, రంజాన్ పండుగల వేళ పస్తులుండాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని, ముడి సరుకుల సరఫరాదారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని కాంట్రాక్టర్ల ప్రతినిధి సాయి కిరణ్ తెలిపారు. వారం రోజుల వ్యవధిలో బకాయిలపై కమిషనర్ స్పందించి నిర్ణయం తీసుకోవాలని, లేదంటే నిర్వహణ పనులను ఎక్కడికక్కడ నిలిపివేస్తామని ఈ సందర్భంగా సాయి కిరణ్ హెచ్చరించారు.
కొత్త సరిళ్లలో బడ్జెట్ కటకట..
ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త సరిళ్లలో పనుల స్థాయికి తగ్గట్లుగా నిధుల కేటాయింపులు లేవని కమిషనర్‌కు ఇచ్చిన నివేదికలో కాంట్రాక్టర్లు పేరొన్నారు. ప్రస్తుతం ఉన్న కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని, దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి కావడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. పరిపాలన అనుమతులు, బడ్జెట్ సవరణలు యుద్ధప్రతిపాదికన చేపట్టాలని డిమాండ్ చేశారు.
బిల్లుల చెల్లింపు ప్రక్రియలో కీలకమైన వర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డబ్యూఎంఎస్) సరిగ్గా పనిచేయకపోవడంపై కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఆర్పీ పోర్టల్ తో సమన్వయం లేకపోవడంతో డాక్యుమెంటేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ సాంకేతిక లోపాలను వెంటనే సరిదిద్దాలని కోరారు. సమస్యలు పరిషరించకపోతే నగర అభివృద్ధి పనులపై ప్రభావం పడుతుందని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

