న్యూఢిల్లీ: సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షలను ఇవాళ లోక్‌సభ(Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా కోరారు. సభా నిర్వహణ సక్రమంగా జరిగితే.. నిర్మాణాత్మక రీతిలో చర్చలు జరుగుతాయని, దీంతో బిల్లులను పాస్ చేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సభా వ్యవహరాలు బ్రేక్ కాకుండా ఉండాలంటే విపక్షాలు, ట్రెజరీ బెంచ్‌లు కలిసి పనిచేయాలన్నారు. సీజేపీ నిరసనల వేళ జరిగిన లాఠీఛార్జ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని ప్రభుత్వం హామీ ఇచ్చినా విపక్షాలు మాత్రం తమ ఆందోళన విరమించలేదు. విపక్షాలు చర్చ నుంచి పారిపోకూడదని, హోంమంత్రి ప్రకటన వేళ సభలో గందరగోళం సృష్టించవద్దు అని అన్నారు. అయితే అయోధ్య రామాలయ విరాళాల చోరీ అంశాన్ని కూడా చర్చించాలని, దీనిపై కూడా మంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు డిమండ్ చేశాయి.
మంగళవారం కూడా లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవడంతో స్పీకర్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల నిర్వహణకు సహకరించాలని కోరినా విపక్షాలు తగ్గకపోవడంతో స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదావేశారు.
మరో వైపు పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ సభ్యులు.. జార్ఖండ్‌లో జరిగిన విద్యార్థులపై లాఠీఛార్జ్ ఘటనను వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేపట్టారు. జార్ఖండ్‌లో జరిగిన లాఠీఛార్జ్‌పై రాహుల్ గాంధీ మాట్లాడాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
#WATCH | Delhi | BJP MP Vivek Thakur says, “Rahul Gandhi will have to speak on the police brutality against students in Jharkhand.” pic.twitter.com/REUY3Nxgsq
— ANI (@ANI) August 11, 2026