Streams | నిజాంపేట్, ఆగస్టు 12 : అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వరుణుడు ఆలస్యంగానైనా కరుణించడంతో గత నెల రోజులుగా రైతన్నల ఎదురుచూపులకు పుల్‌స్టాప్ పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులోకి కొంత నీరు వచ్చి చేరగా.. మండలానికి పైభాగాన ఉన్న కర్ణాటకలో భారీ వర్షాలతో నీరు వాగులు, వంకలతో దిగువకు వచ్చి చేరుతోంది. దీంతో మండల పరిధిలోని నాగధర్ గ్రామ సమీపంలో ఉన్న మొండి మత్తడితోపాటు ఇతర వాగులు పొంగిపొర్లుతున్నాయి.
వాగులు పొంగిపొర్లుతుండటంతో చాలా రోజులుగా కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వాగుల సమీప ప్రాంత రైతన్నల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ పొంగి పొర్లుతున్న నీరంతా రెండు మూడు గ్రామాలను కలుపుతూ నిజాంసాగర్ జలాశయంలోకి చేరుతుంది.
Dharmasthala: ధర్మస్థలిలో మృతదేహాల వెలికితీత.. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు
RS Praveen Kumar | కోడి గుడ్ల కుంభకోణం రూ. 600 కోట్లు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Gunfire | చందానగర్‌లో దొంగల బీభత్సం.. ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు
.