ST Girls Gurukul school | నాగల్గిద్ద, జూలై14 : సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం కరస్గుత్తిలో పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎస్టీ బాలికల గురుకులం సమస్యల నిలయంగా మారింది. గురుకులం నిర్వాహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ కరువవడంతో నిర్వాహకులు, గురుకుల ప్రిన్సిపాల్ అగడాలకు అంతులేకుండాపోతున్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గురుకుల నిర్వాహణల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతుండడానికి వారం రోజులనుండి సెప్టిక్ ట్యాంకు నిండి మరుగు నీరు ఆవరణలో పారడంతో దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకే కాకుండా గురుకులం చుట్టు ప్రక్కన ఉన్న పొలంలో పని చేసేవారికి కూడా దుర్వాసనకు తట్టుకోలేని దుస్థితి నెలకొంది.గురుకులంలో నిర్వాహణలో అడుగడుగునా లోపాలు కన్పిస్తున్నాయి. దీంతో గురుకుల అద్వానంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దుర్వాసనతో విద్యార్థులు రోగాల బారిన పడే ఆస్కారం..
పారిశుధ్యం చర్యలు సక్రమంగా చేపట్టకపోవడంతో వసతి గృహంలో స్వచ్చత లేక ఆపరిశుభ్రంగా మారింది. గురుకులంలో వెదజల్లుతున్న దుర్వాసనతో విద్యార్థులు రోగాల బారిన పడే ఆస్కారం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాలన గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తిసుకుంది. గురుకులాల్లో లోపాలు నివారించేందుకు నిరంతరం తనిఖీలు చేయాలంటూ కలెక్ట్లర్లు, అదనపు కలెక్లర్లు, జిల్లాస్థాయి అధికారులతోపాటు మండలస్థాయి అధికారులను తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు.
తనిఖీలతోపాటు గురుకులాల్లో వడ్డించే భోజనాన్ని తిని అక్కడే ఒక్కరోజు బస చేయాలని సూచించారు. కానీ సీఎం ఆదేశాలు మాటలకే పరిమితమయ్యాయని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గురుకులం సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. అన్ని సౌకర్యాలు బాగుంటాయని గురుకులాల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్నారు.
గురుకులంలో స్వచ్చత లేకుండా ఆపరిశుభ్రంగా మారింది. గత వారం రోజులనుండి సేప్టిక్ ట్యాంకు నిండి మురుగు నిరు బయటికి రావడంతో గురుకులం అంతా కంపుకోడుతుంది, దుర్వాసనతోవిద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కాని ఎవ్వరు పట్టించుకుంటాలేరు. గురుకులం నిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికైనా అదికారులు పట్టించుకోని సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం.
ఉన్నాతాధికారులు పర్యవేక్షించాలి : మోహన్ రాంతీర్థ్ గ్రామం
ఉ్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గురుకులం నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. గురుకులంలో సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టింపులేదు. రెండో శనివారం మా బిడ్డను చూడడానికి వచ్చినజ గురుకులంలో దుర్వాసనకు తట్టుకోలేకపోయ్యాం. గురుకులం అంతాకంపు కొడుతున్నా ప్రిన్సిపాల్ మేడం పట్టించుకోకవడం తగదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని