Juluri Gourishankar | రామగిరి, జూలై 14: మండల కేంద్రంలోని సెంటినరీకాలనీ అంబేద్కర్ -పూలే చౌక్ లో గల అంబేద్కర్ -పూలే విగ్రహాల వద్ద సోమవారం జూలూరి గౌరీశంకర్ రచించిన బహుజనగణమన పుస్తకాన్ని బహుజన నాయకులు ఆవిష్కరించారు. బడుగు, బలహీన వర్గాల బాధలతో పాటు బహుజనలకు రాజ్యాధికార ఆవశ్యకతను కవితా సంపుటి రూపంలో తన భావాలను ఈ పుస్తక రూపంలో వ్యక్తపరిచారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు మేధరవేన కుమార్ యాదవ్, బహుజన నాయకులు కాపురవేన భాస్కర్, ఆసం తిరుపతి, బుర్ర శంకర్, మేడగొని రాజన్న, ధర్ముల రాజసంపత్, గుండం రవి, మంథని సమ్మయ్య, సల్పాల సదానందం, కాట అనిల్, బీసగోని శ్రావణ్, గుమ్మడి ప్రసాద్, వేగోలపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.