మండల కేంద్రంలోని సెంటినరీకాలనీ అంబేద్కర్ -పూలే చౌక్ లో గల అంబేద్కర్ -పూలే విగ్రహాల వద్ద సోమవారం జూలూరి గౌరీశంకర్ రచించిన బహుజనగణమన పుస్తకాన్ని బహుజన నాయకులు ఆవిష్కరించారు.
బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దీంతో చేతివృత్తులు ఉత్పత్తి కేంద్రాలుగా మారడం ఖాయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.