Registration Department | జగిత్యాల : రిజిస్ట్రేషన్ శాఖా సర్వర్ డౌన్ కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, అది వారాలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమ వారానికి స్లాట్లు బుక్ చేసుకున్న క్రయవిక్రయదారులు కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు.
ఇటీవలి కాలంలో తరచూ సేవల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని, సంకేతికంగా ఎదురయ్యే సమస్యలను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు త్వరగా పరిష్కరించి క్రయవిక్రయ దారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.