Student | ఆరు రోజులుగా అదృశ్యమైన ఓ విద్యార్థిని (Delhi University student) యమునా నది (Yamuna River)లో శవమై తేలింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురకు చెందిన 19 ఏళ్ల స్నేహ దేబ్నాథ్ (Sneha Debnath) తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీలోని పర్యవరణ్ కాంప్లెక్స్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ సనాతన్ ధర్మ కళాశాలలో బీఏ మ్యాథమెటిక్స్ చదువుతోంది. అయితే, స్నేహ జులై 7వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయింది.
స్నేహితురాలు పిటునియాను కలిసేందుకు సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్కు వెళ్తున్నానని చెప్పి ఈనెల 7న ఉదయం 5:15 గంటలకు స్నేహ ఇంటి నుంచి క్యాబ్లో బయల్దేరింది. 8:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులు స్నేహను సంప్రదించగా ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో వారు స్నేహ స్నేహితురాలు పిటునియాకు ఫోన్ చేయగా.. తన వద్దకు రాలేదని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను సంప్రదించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్నేహ కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో స్నేహ సిగ్నేచర్ బ్రిడ్జి (Signature Bridge) వద్ద కనిపించినట్లు స్థానికులు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సాయంతో యమునా నదిలో విద్యార్థిని కోసం గాలించారు. ఈ క్రమంలో అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం సిగ్నేచర్ బ్రిడ్జికి పది కిలోమీటర్ల దూరంలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో స్నేహ మృతదేహాన్ని గుర్తించారు. స్నేహ కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు ఆమె స్నేహితులు తెలిపారు.
Also Read..
Earthquake | ఇండొనేషియాలో భారీ భూకంపం
Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Robert Vadra | మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా