Earthquake | ఇండొనేషియా (Indonesia)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. అయితే, ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు ఏమీ లేవని పసిఫిక్ సునామీ (tsunami) హెచ్చరిక కేంద్రం తెలిపింది.
తూర్పు మలుకు ప్రావిన్స్ (Maluku province)లోని తువాల్ (Tual) నగరానికి పశ్చిమాన 177 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. సోమవారం ఉదయం ఈ ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు తీవ్ర స్థాయిలో ఉండటంతో పలు భవనాలు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
Also Read..
San Rechal | మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ శాన్ రాచెల్ ఆత్మహత్య.. అధిక మోతాదులో మాత్రలు వేసుకొని..
Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Parupalli Kashyap | సైనా విడాకుల ప్రకటన వేళ.. విదేశాల్లో చిల్ అవుతున్న కశ్యప్.. ఫొటో వైరల్