Parupalli Kashyap | భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. విడాకుల ప్రకటన వేళ కశ్యప్ తన ఫ్రెండ్స్‌తో విదేశాల్లో చిల్ అవుతున్నారు.
సైనా నెహ్వాల్ ఇన్‌స్టాలో విడాకుల ప్రకటనకు ముందు కశ్యప్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. ఫ్రెండ్స్‌తో కలిసి నెదర్లాండ్స్ (Netherlands)లో జరిగిన ఓ ఫెస్టివల్లో పాల్గొన్నట్లు తెలిపారు. జులై 11 నుంచి 13 వరకూ నెదర్లాండ్స్‌లోని హిల్వారెన్బీక్లో అవేకెనింగ్స్ ఫెస్టివల్లో (Awakenings Festival) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్‌తో కలిసి మంచిగా చిల్ అయ్యారు. వారితో ఫెస్టివల్‌ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కశ్యప్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
సైనా విడాకుల పోస్టు..
పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)తో విడిపోతున్నట్లు సైనా నెహ్వాల్ (Saina Nehwal) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఏడేండ్ల వివాహ బంధానికి, 20 ఏండ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో విడాకులు తీసుకుంటున్నామని చెప్పారు.
‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన, చర్చల తర్వాత కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాం. కశ్యప్‌తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే, విడాకులపై కశ్యప్ ఇంత వరకూ స్పందించలేదు.
Also Read..
Saina Nehwal | కశ్యప్‌తో ఏడేండ్ల వివాహ బంధానికి సైనా నెహ్వాల్ ఫుల్స్టాప్..