IND vs ENG 3rd Test Day 4 Highlights | భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్ట్ లార్డ్స్ మైదానంలో జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటముగిసింది. ఆదివారం స్టంప్స్ పడే వరకు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయానికి 135 పరుగుల దూరంలో ఉన్నది. ఇంగ్లండ్, భారత్ తొలి ఇన్నింగ్స్ 387 పరుగుల వద్ద ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిస్ జట్టు 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆట ముగిసే వరకు కేఎల్ రాహుల్ 47 బంతుల్లో ఆరు ఫోర్ల సహాయంతో 33 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
భారత్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో వికెట్లను కోల్పోయింది. టీమిండియా స్కోర్ 5 వద్ద ఉండగా.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ యశస్వి జైస్వాల్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఖాతా తెరవకుండానే జైస్వాల్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఇద్దరూ షాట్లు ఆడేందుకు ప్రయత్నించారు. ఇద్దరు కలిసి మంచి షాట్స్ ఆడుతూ స్కోర్‌ను పరుగులెత్తించారు. రెండో వికెట్‌కు ఇద్దరు 66 బంతుల్లో 36 పరుగులు జోడించారు. బ్రైడాన్ కార్స్ ఇద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. నాయర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 33 బంతుల్లో ఫోర్ సహాయంతో 14 పరుగులు చేసి కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శుభ్‌మాన్ రెండో ఇన్నింగ్స్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. కార్స్ బౌలింగ్‌లోనే గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాష్ దీప్‌ను బెన్ స్టోక్స్ బౌల్డ్ చేశాడు. 11 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్‌కు రెండు, ఆర్చర్, స్టోక్స్ తలో వికెట్ దక్కింది.
వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను వణించాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ గెలవాలంటే 193 పరుగులు చేయాలి. రెండు జట్లు తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులు చేశాయి. నాల్గవ రోజు ఇంగ్లండ్ ఆట 2/0 స్కోరు వద్ద మొదలైంది. జాక్ క్రౌలీ, బెన్ డకెట్ క్రీజులోకి వచ్చారు. తొలి సెషన్లో మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్‌ను ఇబ్బందిపెట్టాడు. హైదరాబాదీ బౌలర్ బెన్ డకెట్, ఓలీ పోస్ పెవిలియన్‌కు పంపాడు. డకెట్ (12), పోప్ (4) తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యారు. ఆ తర్వాత నితీశ్‌రెడ్డి బౌలింగ్‌లో జాక్ క్రౌలీ జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
49 బంతుల్లో 22 పరుగులు చేసిన పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇదే సెషన్లో ఆకాశ్ దీప్‌కు నాలుగో షాక్ ఇచ్చాడు. క్రీజులో కుదురుకున్న హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో సెషన్లో వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. మొదట జో రూట్‌ను బౌల్డ్ చేశాడు. 96 బంతుల్లో ఫోర్ సహాయంతో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జేమీ స్మిత్ (8)ను బౌల్డ్ చేసి వరుస షాక్‌లు ఇచ్చాడు. మూడో సెషన్లోనూ సుందర్ బెన్ స్టోక్స్ (33), షోయబ్ బషీర్ (2) అవుట్ చేశాడు. అదే సమయంలో క్రిస్ వోక్స్ (10), బ్రైడాన్ కార్స్ (1)లను బుమ్రా అవుట్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ ఐదు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో సుందర్‌కు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, బుమ్రా, సిరాజ్‌కు తలా రెండు, నితీశ్‌రెడ్డి, ఆకాశ్ దీప్‌లకు తలా ఒక వికెట్ దక్కింది.