Sunil Gavaskar | భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో నాల్గో రోజున జో రూట్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి బయటపడడంతో గవాస్కర్ డీఆర్ఎస్పై ప్రశ్నలు లేవనెత్తారు. వాస్తవానికి మహ్మద్ సిరాజ్ వేసిన బంతి వేయగా రూట్ సరిగా ఆడలేకపోయాడు. బంతి ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. సిరాజ్‌తో పాటు ఫీల్డర్ల అప్పీల్‌ను అంపైర్ పాల్ రీఫెల్ అప్పీల్ చేయగా తిరస్కరించారు. ఆ తర్వాత భారత జట్టు డీఆర్ఎస్కు వెళ్లింది.
డీఆర్ఎస్లోనూ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించారు. గవాస్కర్ టెక్నిక్‌ను మాత్రమే కాకుండా అంపైర్ పాల్ రీఫెల్ నిర్ణయాన్ని కూడా విమర్శించారు. ఇదంతా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 38వ ఓవర్లో జరిగింది. సిరాజ్ వేసిన బంతికి లోపలికి వెళ్లి రూట్ ప్యాడ్స్‌ను తాకింది. సిరాజ్ అప్పీల్ చేశాడు. స్లిప్‌లో ఉన్న భారత ప్లేయర్స్ అంతా అప్పీల్ చేసినా అంపైర్ అవుట్ ఇవ్వకపోడంతో సిరాజ్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కలిసి డీఆర్ఎస్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రీప్లేలో రూట్ క్రీజు నుంచి చాలా వరకు బయటకు వచ్చాడని, బంతి లైన్లోకి వచ్చిందని తేలింది. ఇంపాక్ట్‌లో లెగ్ స్టంప్ స్పష్టంగా కనిపించింది.
DRS
దాంతో రూట్ అవుట్ అని భారత ప్లేయర్లు భావించారు. అయితే, బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను తేలికగా తాకినట్లు చూపించింది. అయినా రూట్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. దాంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సిరాజ్ నిరాశకు అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న గవాస్కర్ సైతం అసంతృప్తిని వెళ్లగక్కారు. బాల్ ట్రాకింగ్ డేటా ఖచ్చితత్వాన్ని ఆయన ప్రశ్నించారు. గవాస్కర్ మాట్లాడుతూ ‘బంతి కేవలం లెగ్ స్టంప్‌ను తాకింది అంటున్నారు? ఇది అసాధ్యం. అది నిజంగా లెగ్ స్టంప్‌ను పూర్తిగా గీరాటేసినట్టుంది. ఇలాంటి టెక్నాలజీపై ఎలా నమ్మకం పెట్టుకోవాలి?’ అని ప్రశ్నించారు.
మంచి విషయం ఏమిటంటే భారత్ రివ్యూ వృథా ఏం కాలేదని.. సిరాజ్ ఖచ్చితంగా వికెట్ తీశాడని.. కానీ, సాంకేతికంగా నిరాశ కలిగిందన్నారు. మాజీ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ జోనాథన్ ట్రాట్ కూడా డీఆర్ఎస్లో ఇచ్చిన నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రీప్లే చూసిన తర్వాత దాన్ని నమ్మలేకపోయానని.. బంతి లెగ్ స్టంప్ లోపలికి తాకిందని నేను అనుకున్నానన్నారు. రియల్ టైమ్‌లో చూసిన తర్వాత, అది మిస్ అయిందని నేను నమ్మలేకపోయానన్నారు. ఆ తర్వాత టీ విరామానికి ముందు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రూట్ (40 పరుగులు) బౌల్డ్ అయ్యాడు.