Saina Nehwal | కశ్యప్‌తో ఏడేండ్ల వివాహ బంధానికి సైనా నెహ్వాల్ ఫుల్స్టాప్..
భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
న్యూఢిల్లీ: భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఏడేండ్ల వివాహ బంధానికి, 20 ఏండ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో విడాకులు తీసుకుంటున్నామని చెప్పారు.
‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన, చర్చల తర్వాత కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాం. కశ్యప్‌తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

సైనా, కశ్యప్ జంట 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. అక్కడే వారి స్నేహం ప్రేమగా మారడంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సైనా రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. 2015లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించారు. దీంతో ఆ ర్యాంక్ సాధించిన తొలి మహిళగా నిలిచారు. సైనా చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఆడారు. ఇక కశ్యప్ 2014లో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు. 2024లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. కోచింగ్ ప్రారంభించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

