San Rechal | పుదుచ్చేరి (Puducherry)కి చెందిన ప్రముఖ మోడల్ శాన్ రాచెల్ (San Rechal) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె వయసు 25 ఏళ్లు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్న ఆమె అధిక మోతాదులో రక్తపోటు మాత్రలు తీసుకొని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాన్ రాచెల్‌ను శంకరప్రియ అని కూడా పిలుస్తారు. శాన్ రాచెల్ చాలా నల్లగా ఉంటుంది. దీంతో చిన్నతనం నుంచే ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. రంగుతో సంబంధం లేకుండా శాన్ రాచెల్ తన ప్రతిభతో మోడలింగ్ రంగంలో రాణించింది. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. 2020-21లో మిస్ పుదుచ్చేరి, 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, అదే ఏడాదిలో మిస్ బెస్ట్ యాటిట్యూడ్ తదితర టైటిల్స్‌ని గెలుచుకుంది.
అంతేకాదు మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ టైటిల్ (Miss world black beauty winner)ను కూడా కైవసం చేసుకుంది. ఫ్యాషన్ షోలు, ఇతర కార్యక్రమాలను హోస్ట్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జూన్ 5న ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శాన్ రాచెల్ గదిలో సూసైడ్ నోట్‌ను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మరణానికి భర్త, అత్తింటి వారు బాధ్యులు కాదని రాసింది. ఫ్యాషన్ షో సహా పలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కలిగిన నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని, అవే ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఉరులాయన్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Robert Vadra | మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా
Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Saroja Devi | ఇండస్ట్రీలో మరో విషాదం.. నాటి అందాల నటి సరోజా దేవి కన్నుమూత