Rajanna Sircilla | బతికుండగానే చంపేశారు.. భర్త చనిపోతే, భార్య మృతిగా నమోదు!
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి జీవితాన్ని తలకిందులు చేసింది. భర్త చనిపోతే భార్యే మరణించిందని ఆన్లైన్లో నమోదు చేయడంతో పింఛన్ అందుకోలేకపోతున్నది.
Rajanna Sircilla | కోనరావుపేట, మార్చి 17: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి జీవితాన్ని తలకిందులు చేసింది. భర్త మరణంతో జీవనాధారం కోల్పోయిన ఆమెకు ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ ఆశ్రయం కావాల్సింది పోయి, అధికారుల పొరపాటు వల్ల ఆ అవకాశమూ లేకుండా పోయింది. భర్త మరణాన్ని నమోదు చేసే క్రమంలో, సంబంధిత అధికారులు వృద్ధురాలే మృతి చెందినట్లుగా కంప్యూటర్ నమోదు చేయడంతో ఈ విపరీత పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా వివరాలిలా ఉన్నాయి..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన వృద్ధురాలు మాదాసు నర్సవ్వ భర్త నర్సయ్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో భర్త పింఛన్ తనకు వస్తదని ఆలస్యంగా తెలుసుకున్న వృద్ధురాలు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లింది. అయితే ఆన్లైన్ రికార్డుల్లో వృద్ధురాలు నర్సవ్వ మరణించినట్లుగా నమోదై ఉండడంతో అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆశ్చర్యానికి గురైన వృద్ధురాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ న్యాయం చేయాలని వేడుకుంటోంది.
తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు చూపించినా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవైపు వయస్సు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు తనను కుంగదీస్తున్నాయంది. అయినా పింఛన్ కోసం తిరుగుతున్నానని, రోజులు గడుస్తు న్నా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని గోడు వెల్లబోసుకుంది. ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి, రికార్డులను సరిదిద్దాలని బాధితురాలు కోరు తోంది. కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక చొరవ తీసు కుని తనకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటోంది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

