Danam Nagender | బీఆర్ఎస్ పార్టీ మారి తప్పు చేసానేమో..! ఎమ్మెల్యే దానం నాగేందర్ పశ్చాత్తాపం
Danam Nagender | బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు తప్పు చేశామోనని ప్రశ్చాత్తాపడుతున్నారు.
Danam Nagender | బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు తప్పు చేశామోనని ప్రశ్చాత్తాపడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరితే తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. సీఎం రేవంత్ పాలనపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
రేవంత్ రెడ్డి తనని తాను కాపాడుకొని పార్టీని గాలికి వదిలేశారంటూ ఖైరతాబద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రేవంత్ తీరుపై చురకలంటించారు.
తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదని, కనీసం రూ. 10 కోట్ల నిధులు కూడా తెచ్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నిధులు ఇవ్వట్లేదంటూ వ్యాఖ్యానించారు. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ నేతలే కారణమని మరో బాంబు పేల్చాడు. తన ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫోటోలు ఉంటాయని, కేసీఆర్ ఒక సునామీ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఒకప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోయిందన్న నోటితోనే బీఆర్ఎస్ను పొగడటం, కాంగ్రెస్ మళ్లీ గెలవడం కష్టమనే భావనలో దానం ఉన్నట్లు తెలుస్తోంది. గులాబీ గూటికి తిరిగి చేరడానికి తహతహలాడుతున్నట్లు సమాచారం. దానం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మరో జంపింగ్ ఎమ్మెల్యే పోచారం కూడా అంతర్మథనంలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరుకోగా అదే బాటలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

