CITU | పటాన్ చెరు, నవంబర్ 15 : శ్రమ శక్తి నీతి – 2025 లేబర్ పాలసీ కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకొస్తుందని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ అతిమేల మానిక్, ఉపాధ్యక్షుడు పి పాండురంగారెడ్డి అన్నారు .
శనివారం పటాన్ చెరు శ్రామిక భవన్ లో ‘శ్రమశక్తి నీతి – 2025’ నూతన లేబర్ పాలసీపై సీఐటీయూ సెమినార్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను దొడ్డి దారిన అమలు చేసేందుకు శ్రమశక్తి నీతి – 2025 నూతన లేబర్ పాలసీనీ తీసుకొస్తుందని అన్నారు. కరోనా సమయంలో 29 రకాల కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చింది అని అన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు పోరాటాలు, సమ్మెతో అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం వెనుకకు తగ్గిందని అన్నారు.
ఇప్పుడు లేబర్ కోడ్స్‌ను దొడ్డి దారిన అమలు చేసేందుకే శ్రమశక్తి నీతి 2025 నూతన లేబర్ పాలసీని తీసుకొచ్చిందని అన్నారు. ఇది పూర్తిగా కార్మికులకు వ్యతిరేకమైందని రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. కార్మికుల హక్కుల మీద కేంద్ర ప్రభుత్వం శ్రమ శక్తి నీతి లేబర్ పాలసీ పేరుతో తీవ్రంగా దాడి చేస్తున్నదని అన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన శ్రమశక్తి నీతి లేబర్ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ను వెంటనే సమావేశపరిచి శ్రమశక్తి నీతి లేబర్ పాలసీపైన చర్చించాలని డిమాండ్ చేశారు. కార్మికులను అవగాహన కల్పించేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో సెమినార్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సెమినార్ లో యూనియన్ జనరల్ సెక్రెటరీ మదన్ రెడ్డి, నాయకులు మూర్తి గణపతి, మహేష్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Citu1
Metro Station | ఢిల్లీ పేలుడు.. నాలుగు రోజుల తర్వాత తెరుచుకున్న రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్
Suryapet : లబ్ధిదారులకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ