BRS Party | ఝరాసంగం, జనవరి 25: ప్రజల అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పిలుపునిచ్చారు.
ఆదివారం ఝరాసంగం మండల పరిధిలోని గంగాపూర్ గ్రామ సర్పంచ్ షాహదా బీ, ఉపసర్పంచ్ సుజాతతోపాటు వార్డు మెంబర్లు మొగలమ్మ, నాగలక్ష్మి, మలన్ బీ, గొల్ల యాదయ్య, బాబు మియా, సంజీవ్ కుమార్, పాషా, గోరేమియా షకీల్, బస్వరాజ్, కిష్టప్పలు ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, మాజీ ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, నరసింహ గౌడ్, తుమ్మన్పల్లి సర్పంచ్ సోహిల్, మాజీ సర్పంచులు బస్వరాజ్ పటేల్, ప్రభు పటేల్, నాయకులు సత్యం ముదిరాజ్, గ్రామ మాజీ సర్పంచ్ శివరాజ్ పాటిల్, ఉమేష్ పాటిల్, నజీమ్ పటేల్, మస్తాన్, ధనరాజ్, సామెల్, బక్కప్ప, నర్సింలు, గొల్ల అంజయ్య, బీరప్ప రమేశ్, మోసిన్, గోపాల్, సురప్ప, బాబు రావు, భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
T20 World Cup | పాకిస్తాన్కు ఐసీసీ వార్నింగ్.. తోక ముడిచిన పాక్.. టీ20 జట్టు ప్రకటన
Narsapur | చిత్తారమ్మ దేవి ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లిన దుండగులు