Rythu Maha Dharna | పటాన్ చెరు, జూన్ 21 : రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అంబెడ్కర్ సర్కిల్ వద్ద రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు.
పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, అమీన్పూర్, పటాన్చెరు జిన్నారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా పటాన్ చెరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో మహాధర్నాకు చేరుకున్నారు.
ఈ మహాధర్నాలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, వెంకటేశం గౌడ్, బాల్ రెడ్డి, సోమిరెడ్డి,ఐలాపూర్ మాణిక్ యాదవ్‌తోపాటు రైతులు పాల్గొన్నారు. మహాధర్నాకు రాష్ట్ర మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతోపాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరుకానున్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్