Mahesh bhagavat | మునిపల్లి, ఏప్రిల్ 16; రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చునని రాష్ట్ర అడిషనల్ డీజీపీ మహేష్ మురళిదర్ భగవత్ అన్నారు. గురువారం మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ శివారులోని woxsen యూనివర్సిటీలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధిషనల్ డీజేపీ మహేష్ మురళిదర్ భగవత్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా అడిషనల్ డీజీపీ మహేష్ మురళిదర్ భగవత్ మాట్లాడుతూ.. రోడ్డు నిబంధనలు పాటించకుండ నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వళ్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువ మంది మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందిన వారే ఉన్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటంతో రోడ్డు ప్రమాదంలో గాయాలై ఆసుపత్రి పాలై మృతి చెందడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు.
రోడ్డుపై వాహనాలు నడిపే వారు… రోడ్డు నిబంధనలు పటిస్తూ సురక్షితంగా మీమీ గమ్యలకు చేరుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. రోడ్డుపై బైకులు, స్కూటీలు నడిపే వారు క్రమం తప్పకుండా వాహనము నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలన్నారు. కార్ నడిపే వారు సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడపరాదు అన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనాలు నడిపే వారు ఇంటి వద్ద మీ కొసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారన్న విషయం గుర్తుంచుకోని వాహనాలు నడపాలన్నారు.
వాహనం నడిపే వారు ప్రతి ఒక్కరు రోడ్డు నియమనిబంధనలు పాటించాలన్నారు. రోడ్డుపై నిత్యం జరిగే ప్రమాదాలు హెల్మెట్ లేకుండా వాహనము తోలడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీట్ బెల్ట్ వినియోగించకుండా వాహనం నడపడం వల్లనే అధికా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. వాహనాల తనిఖీల్లో పోలీస్ అధికారులను చూసి కొంతమంది వాహనదారులు తప్పించుకొని పారిపోయే క్రమంలో సైతం ప్రమాదాలు జరుతున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారు తప్ప పోలీస్ అధికారుల మాదిరిగా ఉండరు అన్నారు. ప్రజలు బాగుండడం కోసమే ప్రజలు పని చేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ వివరించారు.
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్