Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు.
కారేపల్లి, ఏప్రిల్ 16 : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గురువారం అరైవ్- అలైవ్ రోడ్‌సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ఎస్ఐ బైరు గోపితో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి ఏట రోడ్డు ప్రమాదాలతో అనేకమంది దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ తారకమంత్రమని, పరిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకే అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమ సందేశాన్ని ప్రతిఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. యువత సినిమాల్లో హీరోల్లాగా వాహనాలను నడుపవద్దని, వాహనాలను నడిపేటప్పుడు తమ భార్యపిల్లలు, తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు అందరి కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపాయని,ప్రతిఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

