Collector Valluru Kranthi | కంది, ఏప్రిల్ 23 : భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపునిచ్చారు. ఇవాళ కంది రైతు వేదిక వద్ద భూ భారతి 2025 చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతితో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. భూ భారతితో రైతుల భూ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయన్నారు. రికార్డుల్లో పేరు మార్పు, నూతన పౌతి లాంటివి 30 రోజుల్లో పరిష్కారం అవుతాయని చెప్పారు. భూ రికార్డుల్లో పేరు మార్పిడి కోసం నూతన నోటీసు విధానం అమల్లో ఉందని తెలిపారు.
భూసమస్యలపై సివిల్ కోర్టుకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులే పరిష్కరించేలా రైతు భూమి ఎక్కడుందో సర్వేయర్ చూసి చెప్పేవిధంగా భూ భారతి ఉందన్నారు. భూ భారతి చట్టంపై ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి