Ration Dealers | మునిపల్లి, ఆగస్టు 25 : పెండింగ్లో ఉన్న ఐదు నెలల రేషన్ డీలర్ల కమిషన్ను వెంటనే విడుదల చేయాలని సోమవారం మునిపల్లి తహసీల్దార్ గంగాభవానికి మునిపల్లి మండల రేషన్ డీలర్లు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల రేషన్ డీలర్లు మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత ఐదు నెలల నుంచి రేషన్ డీలర్ల కమిషన్ ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి గత ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ను విడుదల చేసి రేషన్ డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగిశెట్టి, కార్యదర్శి బస్వారాజ్, ఉపాధ్యక్షుడు శ్రీశైలం,మండల డీలర్లు మల్లేశం, శ్రీశైలం, సుభాష్, బుజంగం, దేవయ్య, మునీర్, భారత్ భూషణ్, సురేష్, రాంరెడ్డి, దేవేందర్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు