హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురసరించుకొని రూ పొందించిన ‘కేటీఆర్ సన్ ఆఫ్ సార్.. కదిలే ఫైర్’ అనే ప్రత్యేక గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతున్నది. 16 సంవత్సరాల వయస్సులో, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువ సంగీత దర్శకుడు నిహిత్ సంభవ్ ఈ పాటకు ఆద్భుతంగా స్వరకల్పన చేశారు. పాట సాధించిన ఘన విజయం నేపథ్యంలో, కేటీఆర్ ఆ యువ సంగీత దర్శకుడిని గురువారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ గీతానికి ప్ర ముఖ రచయిత్రి మల్లావజ్జల కృష్ణవేణి సాహిత్యం అందించగా, తెలంగాణ ప్రముఖ దర్శకుడు బందూక్ లక్ష్మణ్ దర్శకత్వం వహించారు.
కాకతీయ ఇన్నోవేటివ్స్ ఆధ్వర్యంలో, పెద్దపల్లి బీఆర్ఎస్ ఇన్చార్జ్ కోరుకంటి చందర్ సమర్పణలో ఈ ప్రత్యే క పాట రూపుదిద్దుకున్నది. పిన్న వయస్సులోనే అద్భుతమైన రీతిలో స్వరాలు సమకూర్చి, శ్రోతలను ఆకట్టుకునేలా సంగీతం అందించడం ఎంతో అభినందనీయమని కేటీఆర్ కొనియాడారు. కాగా, నిహిత్ సంభ వ్ ప్రముఖ తెలంగాణ ఉద్యమ కవి, రచయిత అయిన మల్లావజ్జల సదాశివుడి మనవడు కావడం విశేషం. చిన్ననాటి నుంచే సంగీతంపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ అతి పిన్న వయస్సులోనే తనదైన శైలిలో ప్రతిభను చాటుకుంటున్న నిహిత్, భవిష్యత్తులో తెలుగు సంగీత ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదిగి గొప్ప సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.