Pyaranagar Dumping Yard | గుమ్మడిదల, ఏప్రిల్ 29 : ప్యారానగర్ డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చాలా రోజులుగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం డంపింగ్ యార్డు అనుమతులు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్యారానగర్ డంపింగ్‌యార్డు (ఎంఎస్‌డబ్ల్యూ)పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోదా..? సర్కారుపై నిరసనలు కొనసాగవల్సిందేనా..? అంటూ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీతో ఏర్పాటు కాబోతున్న డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)కు ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి..ఇటీవల ప్రజాభిప్రాయసేకరణలో నూటికి నూరుశాతం ప్రజలు డంపింగ్‌యార్డు వద్దని తమ అభిప్రాయాలు తెలియజేసినా సర్కారు జాప్యం ఎందుకు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాపాలనలో ప్రజల అభిప్రాయాలు పట్టవా.. ? సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోరా..? అంటూ ప్యారానగర్, నల్లవల్లిలో గ్రామాల్లో మంగళవారం 84వ రోజు కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్షలు ఆందోళన కారులు సర్కారును ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా గుమ్మడిదల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మనోవేదనను అర్థం చేసుకుని డంపింగ్‌యార్డును రద్దు చేయాలని సర్కారును వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి