Sorghum Purchase Centres | జహీరాబాద్, ఏప్రిల్ 17 : సంగారెడ్డి జిల్లా మార్క్‌ఫెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు 3371 రూపాయలను ప్రకటించింది అన్నారు. రైతులు జొన్నలు దళారుల వద్దకు తీసుకొనిపోయి మోసపోకుండా.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్మాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ధి పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలోసొసైటీ వైస్ చైర్మన్ కాంతమ్మ, ఏడాకులపల్లి గ్రామ మాజీ రైతుబంధు అధ్యక్షులు, ఏడాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రభు పటేల్, సొసైటీ డైరెక్టర్లు అనాంత్ రామ్ గౌడ్, శ్రీనివాస్, అసిస్టెంట్ రిజిస్టర్ జహీరాబాద్ సర్కిల్ పోముసింగ్, అగ్రికల్చరల్ ఏఈవో వేద, సొసైటీ సీఈఓ శ్రీశైలం, వివిధ గ్రామాల రైతులు రైతులు సంగారెడ్డి, బద్రి, వెంకట్, నర్సింలు, బీరప్ప, విట్టల్ , పండరి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత