bridge | ఝరాసంగం, జూలై 6 : ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు గుంత ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా అధికారులు, నాయకులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో చదువుకోవడానికి విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి ప్రజలు, ఉద్యోగరిత్యా అధికారులు, నాయకులు, వాహనదారులు ఈ వంతెన మీదుగా ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటారు.
ఈ మార్గంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నత అధికారులు, నాయకులు తరచూగా వస్తూంటారు. అయినప్పటీకీ వంతెన పరిస్థితిని వారు గమనించకపోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన మరమ్మత్తుల విషయమై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని వంతెనకు మరమ్మత్తులు చేపట్టేలా సంబంధిత అధికారులకు సూచించాలని ప్రజలు కోరుతున్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు