Roads | కంగ్టి, జూన్ 28 : మండల కేంద్రమైన కంగ్టి నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు వరకు అంతర్ జిల్లా రోడ్డు పూర్తిగా గుంతలమయంగా తయారైంది. ప్రతినిత్యం ఈ రోడ్డు గుండా వందల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి.
గత రెండు సంవత్సరాల నుంచి మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తే మహారాష్ట్రలోని దేగ్లూర్, బిచ్కుంద, జుక్కల్ తదితర ప్రాంతాలకు ప్రయాణించేవారికి దూరభారం తగ్గుతుంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ఈ రోడ్డును వినియోగిస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోడ్డు కాకుండా తడ్కల్, చిన్నకొడప్గల్ మీదుగా ప్రయాణించడంతో 30 కిలోమీటర్ల మేర దూరభారం అవుతుంది.
రెండు సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ఈ రోడ్డు మరమ్మత్తుకోసం రూ.1.90 కోట్ల నిధులు మంజూరు చేసింది. కామారెడ్డి జిల్లా సరిహద్దు నుంచి రెండు కిలోమీటర్ల మేర పనులు అప్పట్లో ప్రారంభమయ్యాయి. అంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం, ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో పనులు అంతటితో నిలిచిపోయాయి.
మరమ్మత్తుపనులు వెంటనే ప్రారంభించాలిః పిట్ల జైపాల్, తుర్కవడగామ, కంగ్టి
కంగ్టి నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు వరకు 9 కిలోమీటర్ల మేర రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని చౌకన్పల్లి, బోర్గి, సర్ధార్తండాలకు చెందిన ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతీ రోజు ఆయాపనుల కోసం కంగ్టికి రావాల్సి వస్తుందని, మోకాల్లోతు గుంతలు ఉండడంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాత్రివేళలో గుంతలు తెలవడం లేదన్నారు. సదరు కాంట్రాక్టర్ స్పందించి వెంటనే మరమ్మత్తు పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి..
కంగ్టి నుంచి కామారెడ్డి జిల్లా 9 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉంది. గత రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈ రోడ్డుగుండా తరుచుగా దేగ్లూర్‌కు వెళ్తుంటాం. ఇప్పుడు హైవేమీదుగా వెళ్లడంతో 30 కిలోమీటర్లు దూరం అవుతుంది. అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలి.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం