నాగర్ కర్నూల్: మండలంలోని వనపట్ల గ్రామానికి చెందిన నాగర్ కర్నూల్ ( Nagarkurnool ) మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం భార్య, కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో తన కంకర క్రషర్ వద్ద ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య (Suicide ) కు పాల్పడ్డాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భార్య గమనించి కొల్లాపూర్ చౌరస్తాలోని గాయత్రి హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అనంతరం మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో నాగర్ కర్నూల్ వైస్ ఎంపీపీగా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగిల్ విండోగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనంతరం పదవి ముగిసిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.