Musi Victim | కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల మూసీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ బాధిత మహిళ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయింది. సదరు బాధిత మహిళ మాట్లాడుతూ.. మేం రీసెంట్‌గానే ఇల్లు కొన్నం. బిడ్డ పెళ్లి చేస్తున్నం మాకు పైసల్లేవంటే.. ఇటీవలే ఇల్లు కొన్నాం. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. కానీ వాళ్లు ఖాళీ చేయలేదు. ఎందుకంటే వాళ్లు ఇల్లు దొరకలేదు. మాకు ఇక్కడే మంచిగనిపిస్తుంది.. పెళ్లి ఇక్కడే చేస్తం.. అని బాధపడుతూ చెప్పారు. మేమింకా ఆ ఇంట్లకు రాకముందే ఈ వార్త వినడుతుంది. మేం ఈ ఇంటిని ఎప్పుడో కొన్నం. కానీ చుట్టపక్కల వాళ్లు కూడా బ్యాంక్ లోన్లు వస్తయన్నారు. ఎప్పుడూ పోతది అని చెప్పలేదు. ఇల్లు పోతుందని తెలిస్తే మేం కొనేవాళ్లమే కాదు కదా అని చెప్పింది.
ఒకవేళ ఈ ఇల్లు పోతే మేం రోడ్డు మీద పడాల్సిందే. నా జాబ్ కూడా పోయింది. మా ఆయన బాగా అస్వస్థతకు లోనయ్యాడు. మేం ఊరుకోం.. దీనిపై మేమెప్పుడూ చూడలేదు.. ఇంత మూర్ఖుడేంటీ..? కాంగ్రెసోళ్లు మా దగ్గరకి వచ్చి ఓటేయమంటే పాపం మంచోళ్లే వేయొచ్చు .. కాంగ్రెస్ ఇందిరాగాంధీ జమాన్ల నుంచి ఉంది కదా..అనుకున్నా. నేను సూపరింటెండెంట్‌గా పనిచేశా. మా ఇల్లు ఎట్లా ఉందో అట్లనే ఉంచాలి. ఇక్కడ సీనియర్ సిటిజన్లు చాలా మంది ఉన్నారు. బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలి. నష్టపరిహారం ఇస్తారన్నారని మీరంటున్నరు.. నేనింత వరకు ఆ మాట వినలేదు.
వాడిబొంద.. మూసీ ఎక్కడి నుంచే ఉంది.. మేం ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నప్పుడు.. మిమ్మల్ని ఖాళీ చేసి మూసీ సుందరీకరణ చేస్తా అంటే మా బతుకులేంటి.. 12:30కు రక్తపు వాంతులయ్యాయి.. ఎక్కడకు తీసుకెళ్లాలి. మానసిక ఆరోగ్యం బాగా లేని పాప ఉంది. అందుకే జాబ్ మానేశాను. పరిస్థితి బాగాలేదు. నిన్న నేను వెళ్లి ఇంటి పన్ను కట్టి వచ్చాను. అమ్మా ఇంటి పన్ను ఎందుకు కడుతున్నవ్ .. నీ ఇల్లు పోతది అంటే నేను కట్టేదాన్ని కాదు కదా.. నాలుగేళ్ల నుంచి కరెంట్ బిల్లు కడుతున్నా. మీరు కరెంట్ బిల్లు కట్టొద్దు..మీరు పోతున్నరు అని చెప్పాలి కదా అని ప్రశ్నించింది. న్యాయం ఉండాలి. హఠాత్తుగా వచ్చి ఒక నిర్ణయం తీసుకుని వెళ్లాలి అంటే ఎవ్వడు ఊరుకోడు. ఇది ప్రజా రాజ్యం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పింది.
కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ రాజ్యం అనుకొని ఓటు వేశాం.. ఈ మూర్ఖుడు ఏంటి ఇలా ఉన్నాడు?
మేము ఈ మధ్యే ఇల్లు కొన్నాము.. ఇంకా గృహప్రవేశం కూడా చేయలేదు
ఇల్లు పోతుందని తెలిసుంటే కొనే వాళ్ళము కాదు https://t.co/LVeaNHAJVO pic.twitter.com/LSU6zfXk5M
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2026
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల