Harish Rao | హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. భవిష్యత్తులో ఎంతో ఉన్నతిని సాధించగల మంచి జర్నలిస్టుగా ఎదుగుతున్న ఆమె జీవితం ఇంత అర్ధాంతరంగా ముగిసిపోవడం విషాదకరం అని పేర్కొన్నారు. ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని ఆమె కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని, స్వేచ్ఛ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు.