Fire Accident: 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఢిల్లీలో 9 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Fire Accident: ఢిల్లీలోని పాలెంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్ చౌక్ మార్కెట్లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. మంటల్ని ఆర్పేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్ చౌక్ మార్కెట్లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనం బేస్మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్‌లో బట్టల దుకాణంతో పాటు కాస్మెటిక్స్ షోరూం కూడా ఉన్నది. అయితే బిల్డింగ్‌లోని టాప్ రెండు ఫోర్లలో ఆ ఇంటి యజమానులు ఉంటున్నారు. అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారిని ప్రవేశ్, కమాల్, ఆశు, లాడో, హిమాన్షి, దీపికతో పాటు ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నారు. అనిల్, సచిన్‌తో పాటు మరో రెండు ఏళ్ల అమ్మాయి గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.
పాలంకు చెందిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బిల్డింగ్ ఓనర్‌ను రాజేంద్ర కశ్యప్‌గా గుర్తించారు. కుటుంబసభ్యులు బిల్డింగ్‌లోని రెండో, మూడో ఫ్లోర్లలో నివసిస్తున్నారు. 20 ఫైర్ టెండర్లు, 11 సీఏటీఎస్ అంబులెన్సులు, బీఎస్ఈఎస్ , ఎయిర్ ఫోర్స్ పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం చేరుకున్నది. స్థానిక పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

