Manjeera Water | సంగారెడ్డి, మార్చి 31 : తలాపునే నీరు ఉన్నా తాగడానికి చుక్క నీళ్లు రాక పండుగ రోజు పట్టణ వాసులు నీళ్ల కోసం ఎదురుచూపులు చూసి అధికారులపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ఆదిత్య నగర్ కాలనీ అధ్యక్షుడు సాయిలు ఆరోపించారు.
పట్టణంలో గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో పట్టణవాసులు అధికారులపై మండిపడుతున్నారని వెల్లడించారు. ముఖ్యంగా వేసవి రాగానే నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన నీటి సరఫరా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీటి కొరత ఏర్పడిందన్నారు.
ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతుంటే మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులకు పట్టింపు లేదా అని ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని ఆదిత్యనగర్ కాలనీ, వసంత నగర్ బర్మా కాలనీ, ఓడిఎఫ్ కాలనీ, బ్యాంకు కాలనీ, పోతిరెడ్డిపల్లి చౌరస్తా 12వ వార్డులలో మంజీరా నీరు రెండు రోజుల నుంచి రాలేవని.. అందులో పండుగలు ఉన్నా మున్సిపల్ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో నీటి కొరత ఏర్పడిందని వాపోయారు.
వేసవి కాలం తీవ్రత పెరుగక ముందే అధికారులు స్పందించి నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని పట్టణవాసుల దాహార్తిని తీర్చాలని అధికారులను కోరారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం