Sigachi blast | పటాన్ చెరు, సెప్టెంబర్ 15 : సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని, 54 మంది కార్మికుల మృతికి కారణమైన యాజమాన్యంను వెంటనే అరెస్ట్ చేయలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్, టీజేఏసీ జిల్లా చైర్మన్ వై అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
సోమవారం సిగాచి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ నాయకులు రహమాన్, హెచ్ఎంఎస్ నాయకులు ఈశ్వర్ ప్రసాద్ కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మృత్యువాత పడి రెండున్నర నెలలు గడుస్తున్న కార్మికులకు పూర్తి న్యాయం జరగలేదని అన్నారు. ఇప్పటివరకు యాజమాన్యం మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. సినిమా టాకీస్ దగ్గర తొక్కిసలాటలో ఒకరు మృతిచెందితే అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 54 మంది కార్మికులు చనిపోయి.. మరో 28 మంది తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా మిగిలిపోయి జీవచ్ఛవాలుగా పడి ఉంటే యాజమాన్యం మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్నారు.
స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనిపోయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు క్షతగాత్రులకు రూ.10 లక్షలు పరిహారం నెలరోజులు ఇస్తామని ప్రకటించారు. ప్రకటించి రెండున్నర నెలలు గడుస్తున్నా 11 కుటుంబాలకు రూ.46 లక్షలు, మిగతా వాళ్లకు రూ.25 లక్షలు పరిహారం అందించామని అధికారులు చెప్తున్నారు. గాయపడ్డ వారికి యాజమాన్యం ఇష్టానుసారంగా అందజేసిందని అన్నారు. కార్మికుల చనిపోయిన కుటుంబాలకు ఒకే విడతలో నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని..గాయపడిన వారికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో యాజమాన్యం ఆలోచించాలి. కానీ కర్కశంగా వ్యవహరిస్తుందని అన్నారు. పూర్తిగా తగ్గేవరకు మెరుగైన వైద్యం అదేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ అండగా ఉండి పోరాడుతామని అన్నారు.
Bhoodan Pochampally : పింఛన్లు పెంచాలని భూదాన్ పోచంపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త
SIR | ‘సర్’ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటాం : సుప్రీంకోర్టు