భోపాల్: మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య పాల్గొన్నది. ఈ వీడియోను ఆమె భర్త సోషల్ మీడియాలో చూశాడు. ఆ వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించాడు. అతడితోపాటు మరికొందరితో కలిసి ఆటోలో వెళ్తున్న భార్యను అనుసరించాడు. అడ్డుకుని ఆమెపై కాల్పులు జరిపి హత్య చేశాడు. (man shot wife dead) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. అరవింద్, నందినికి 2023లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో పెళ్లి జరిగింది. అయితే భర్తకు అప్పటికే వివాహితురాలైన ప్రియురాలు, ఆమె ద్వారా ఒక బిడ్డ ఉన్నట్లు నందిని తెలుసుకున్నది. అరవింద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కారుతో తొక్కి హత్య చేసేందుకు అరవింద్ ప్రయత్నించినట్లు నందిని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, ఢిల్లీలో పని చేస్తున్న నందిని విడిగా నివసిస్తున్నది. అయితే జైలు నుంచి విడుదలైన భర్త అరవింద్ తనను వేధిస్తున్నట్లు సెప్టెంబర్ 9న గ్వాలియర్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఐ ద్వారా తన అశ్లీల ఫోటోలు, వీడియోలు సృష్టించి అప్లోడ్ చేస్తున్నాడని ఆరోపించింది. ఆ తర్వాత ప్రియుడైన అంకుష్ పాఠక్ బర్త్ డే వేడుకలో నందిని పాల్గొన్నది. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Birthday Party
మరోవైపు ఈ వీడియో క్లిప్ చూసిన అరవింద్, భార్య నందినిపై మరింత ఆగ్రహించాడు. సెప్టెంబర్ 12న అంకుష్ పాఠక్, అతడి ఫ్రెండ్‌తో కలిసి ఆమె ఆటోలో ప్రయాణించడాన్ని చూశాడు. మరో ఆటోలో వారిని అనుసరించాడు. రోడ్డు మధ్యలో వారి ఆటోను అడ్డుకున్నాడు. అందరూ చూస్తుండగా పిస్టల్‌తో నందినిపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. అక్కడకు చేరుకున్న పోలీసులపైకి కూడా గన్ను ఎక్కుపెట్టాడు. అయితే పోలీసులు చాకచక్యంగా అరవింద్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్థానికులు అతడ్ని చితకబాదారు.
అయితే కాల్పుల్లో గాయపడిన నందినిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రెండు గంటల్లోనే ఆమె మరణించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. అరవింద్ రోడ్డు మధ్యలో నందినిపై కాల్పులు జరిపిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Gwalior, #MadhyaPradesh 📰
A husband shot his wife dead in the middle of the market.
The wife had accused him of cheating her into marriage.
Another tragic end to a broken relationship. 💔#menToo #CrimeNews
pic.twitter.com/hJVES0edFv— MenToo (@MenTooSave) September 13, 2025
Gwalior में एक पति ने बीच सड़क पर गोली मारकर अपनी पत्नी को मौत के घाट उतारा #Gwalior #MPNews #Murder #Crime@jaspreet_k5 pic.twitter.com/G75xf4eh3H
— 💯% Follow Back 🌹Ram Cauhan✒️(मोदी,योगी सपोर्टर) (@Ramchauhan79) September 13, 2025
Also Read:
Baby Girl Buried Alive | 15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు.. రక్షించిన పోలీసులు
Watch: టోల్ ప్లాజా వద్ద పేలిన లారీ టైరు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఎలుగుబంటికి కూల్ డ్రింక్ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?