లక్నో: రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు. పసిబిడ్డ ఏడ్పు, చేయి కదలడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. పోలీసులకు అతడు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆ పసిబిడ్డను కాపాడారు. (Baby Girl Buried Alive) ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం గోడాపూర్ గ్రామంలోని చెట్ల పొదల్లో 15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు. చెట్ల మధ్యలో ఉన్న నేల నుంచి కదులుతున్న శిశువు చేతిని ఒక వ్యక్తి గమనించాడు. ఆ పసిబిడ్డ ఏడుపు కూడా విన్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నేలలో సజీవంగా పాతిపెట్టిన ఆడ బిడ్డను బయటకు తీసి రక్షించారు. శ్వాస తీసుకోవడం గమనించి తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. దీంతో డాక్టర్లు ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. పసిబిడ్డ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు ఆడ బిడ్డను సజీవంగా పాతిపెట్టిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపారు. ఆ శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పసికందును సజీవంగా పాతిపెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:
Tale Of Two Bengal Doctors | వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. జూనియర్ డాక్టర్ అరెస్ట్
Mother Scolds, Son Sucide | కుమారుడ్ని తిట్టి గదిలో బంధించిన తల్లి.. బాలుడు ఆత్మహత్య
Watch: ఎలుగుబంటికి కూల్ డ్రింక్ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?