లక్నో: ఒక అంశంపై కుమారుడ్ని తల్లి తిట్టింది. ఇంట్లోని గదిలో బంధించి పనికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా ఆ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Mother Scolds, Son Sucide) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాన్పూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నిషా అనే మహిళ ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల కుమారుడితో కలిసి నివసిస్తున్నది. తాగుడుకు బానిస అయిన ఆమె భర్త సునీల్ గొడవ వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, శనివారం మధ్యాహ్నం ఒక అంశంపై కుమారుడు కృష్ణను తల్లి నిషా తిట్టింది. ఆ తర్వాత అతడ్ని గదిలో బంధించింది. డోర్ లాక్ చేసి ఇత్తడి కర్మాగారంలో పనికి వెళ్లింది. ఆమె ఇంటికి తిరిగి రాగా కుమారుడు కృష్ణ ఉరికి వేలాడుతూ కనిపించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో తండ్రి హింసాత్మక ప్రవర్తన కారణంగా సూసైడ్ చేసుకుంటానని కుమారుడు కృష్ణ బెదిరించినట్లు తల్లి నిషా పోలీసులకు తెలిపింది. బాలుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Tale Of Two Bengal Doctors | వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. జూనియర్ డాక్టర్ అరెస్ట్
Earthquake | అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. ఉత్తర బెంగాల్, భూటాన్‌లో ప్రకంపనలు
Asaduddin Owaisi | 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా?.. భారత్, పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఆగ్రహం