Nizampet Bridge | నిజాంపేట్, సెప్టెంబర్ 12 : మండల కేంద్రమైన నిజాంపేట్ గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న శాఖాపూర్ గ్రామానికి వెళ్లాలంటే నరకయాతననే.. ప్రభుత్వాలు ఎన్ని మారినా శాఖాపూర్ గ్రామానికి దారి మారలే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామానికి వెళ్లే దారి.. నిజాంపేట్ నుండి నారాయణఖేడ్ 161 బి ప్రధాన రహదారి నుండి శాఖాపూర్ గ్రామానికి 900 మీటర్ల మేర పొడవు రహదారి ఉండగా..అందులో 700 మీటర్ల భీముని చెరువు ఆయకట్ట ఉండగా.. దానిపై నుంచే శాఖాపూర్ గ్రామానికి ప్రధాన రహదారి. ఎన్ని ప్రభుత్వాలు మారిన మా గ్రామానికి వెళ్లే దారి మాత్రం మారలేదు అంటున్నారు గ్రామస్తులు.
అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. చెరువు కట్టపై గుంతల మయంగా ఉండి వెడల్పు లేకపోవడంతో భయభయంగా వెళ్ళవలసి వస్తుందంటున్నారు. కట్టపై నుండి ఎదురెదురు వాహనాలు వచ్చినప్పుడైతే ఏమాత్రం అదుపుతప్పినా అంతే సంగతి.. నాయకులు మాత్రం ఓట్ల సమయంలో వచ్చి హామీలు ఇస్తారు. తప్ప మళ్లీ ఇటువైపు చూసిన దాఖలా ఉండరు. ఈ ఏడాది గత నెలలో కురిసిన వర్షానికి భీముని చెరువు పొంగిపొర్లి అలుగు పారడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అదే రోజు గ్రామంలో ఒక మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గ్రామస్తులు అన్నారు.
అధికారులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ విద్యాచరన్ రెడ్డి , నారాయణఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా హారతి , మండల తహసీల్దార్ నాగజ్యోతి, ఆర్ఐ జాన్సన్, ఇరిగేషన్ అధికారులు ఈఈ సుందర్, డి అరుణ ,ఏఈ మేఘన ఇలా అందరూ వచ్చి చూసి వెళ్లడం జరిగిందన్నారు ,ఇకనైనా మా గ్రామానికి రోడ్డు వేసి వంతెన నిర్మించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంతెన నిర్మించి మమ్మల్ని ఆదుకోరు : గ్రామస్తులు సమ్మె దుర్గయ్య
మా గ్రామానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్న చినుకు పడినా నరకయాతననే.. వేరే గ్రామాలకు వెళ్లి రాత్రి వేళల్లో రావాలంటే చాలా కష్టం అధికారులు నాయకులు స్పందించి శాఖాపూర్ గ్రామానికి వంతెన నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.
శాఖాపూర్ గ్రామానికి రోడ్డు నిర్మించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలి..
నిజాంపేట్ నుండి నారాయణఖేడ్ వెళ్లే ప్రధాన దారి నుండి శాఖపూర్ గ్రామానికి 900 మీటర్ల గుంతల మయంగా మారిన దారిని వెడల్పు చేసి రోడ్డు వేయించి వీధి దీపాలు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్న శాఖాపూర్ గ్రామస్తుడు గడ్డమీది నాగయ్య విజ్ఞప్తి చేశారు.
Mata Vaishno Devi | ఈ నెల 14 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం..!
Shah Rukh Khan | 1500 కుటుంబాలకు సాయం… మరోసారి గొప్ప మనసు చాటుకున్న షారుఖ్ ఖాన్