Seeds | జహీరాబాద్, అక్టోబర్ 21 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యదేయమని జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో రైతులకు యాసంగి విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని.. అందులో భాగంగానే రాష్ట వ్యాప్తంగా శనగ, కుసుమ,వేరు శనగ తదితర విత్తనాలను పంపిణీ చేస్తుందని తెలిపారు.
ఇంకా ఉద్యాన శాఖ తరపున కూడా అనేక రాయితీ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. జహీరాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బిక్షపతి మాట్లాడుతూ.. ప్రస్తుతం పంపిణీ చేసిన ధ్రువీకరించడబడిన కుసుమ విత్తనాలను పండించిన తరువాతి పంట కాలానికి మిగతా రైతులకు అందజేయాలని సూచించారు. ఈ విత్తనాన్ని 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చునన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల వ్యవసాయ అధికారి లావణ్య వినోద్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రదీప్ కుమార్, వీరేందర్ శివప్రియ, వరలక్ష్మీ, రైతులు చంద్ర శేఖర్ రెడ్డి, సంజీవ రెడ్డి, రాములు, మహిపాల్, మల్లన్న, సయీద్ అహ్మద్, ప్రభాకర్, వెంకట్ నరసింహ రెడ్డి, వీర రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!