Sukumar | టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెక్కల మాస్టారుగా పిలిపించుకుంటున్న సుక్కూ తన మేకింగ్, నెరేషన్, ఎమోషన్ హ్యాండ్లింగ్‌తో ప్రేక్షకుల్లోనే కాదు, సినీ ఇండస్ట్రీలో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర వరుస హిట్లు అందించిన సుకుమార్, ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్లో తనదైన స్టాండర్డ్ సెట్ చేశారు. అయితే ఆయన గొప్పతనం కేవలం సినిమాలు తీయడంలోనే కాదు,తన శిష్యులను ప్రోత్సహించడంలో కూడా ముందుంటారు.
ఇప్పటికే సుకుమార్ శిష్యుల్లో పలువురు టాలెంటెడ్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.శ్రీకాంత్ ఓదెల (‘దసరా’), సూర్య ప్రతాప్ (‘18 పేజెస్’), బుచ్చి బాబు సనా (‘ఉప్పెన’) ఇలా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవారు ఇప్పుడు తమదైన శైలిలో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. అయితే ఇటీవల సుకుమార్ దుబాయ్ వెళ్లారు. దీంతో చాలామంది ఆయన రామ్ చరణ్‌తో చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ కోసం స్టోరీ సిట్టింగ్స్‌కి వెళ్లారని అనుకున్నారు. కానీ అసలు విషయం బయటకు రావడంతో నెటిజన్స్ ఆయన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సుకుమార్ ఈసారి తన సినిమా కోసం కాకుండా, తన శిష్యుల సినిమాల కోసం దుబాయ్‌కి వెళ్లారు.
ఆయన శిష్యుడు వీర కోగటం యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే మరో శిష్యురాలు మాధురి.. హీరో సుమంత్ ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతోంది. ఈ రెండు స్క్రిప్ట్‌లపై సిట్టింగ్స్ కోసం సుకుమార్ స్వయంగా దుబాయ్‌కి వెళ్లి గైడ్ చేసినట్లు సమాచారం. సుక్కూ కేవలం గైడ్గానే కాదు, నిర్మాతగానూ తన శిష్యులకు బలంగా నిలుస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఆయన ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్‌పై తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇంత బిజీగా ఉన్నా కూడా తన శిష్యుల కోసం సమయం కేటాయించడం, వారికి మార్గదర్శకత్వం ఇవ్వడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. “ఇంత ఓపిక, ఇంత మంచితనం ఎవరికి ఉంటుంది?” అంటూ సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాప్ డైరెక్టర్‌గా సినిమాలు చేస్తూనే, కొత్త ప్రతిభకు అండగా నిలబడే సుకుమార్ లాంటి గురువులు ఇండస్ట్రీలో అరుదు. అందుకే ఆయనను అభిమానులు “లెక్కల మాస్టర్ మాత్రమే కాదు, మనసు ఉన్న మాస్టర్ కూడా!” అని పొగిడేస్తున్నారు.