Kim Jong Un | ఉత్తర కొరియా పార్లమెంట్ ఎన్నికల్లో కిమ్ ఘన విజయం.. 99.93 శాతం ఓట్లు కిమ్కే
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది.
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ఉత్తర కొరియాకు చెందిన జాతీయ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం.. కొరియాలో అతిపెద్ద వ్యవస్థ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఇదే అక్కడ దేశాన్ని పాలించే పార్లమెంటరీ. ఈ నెల 15న ఉత్తర కొరియాలో 15వ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.
ఇందులో కిమ్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిమ్ కూటమి ఏకంగా 99.93 శాతం ఓట్లు సాధించింది. అంటే పోటీ చేసిన ప్రతి చోటా ఆయన పార్టీయే గెలిచింది. అయితే, 99.97 శాతం ఓట్లు వచ్చాయని కూడా మరో ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 99.99 శాతం ఓట్లు పోలయ్యాయి. 99.93 శాతం ఓట్లు సాధించిన కిమ్‌కు వ్యతిరేకంగా మిగతా స్వల్ప శాతం ఓట్లైనా పడ్డాయనుకుంటున్నారేమో.. అక్కడ అంత ఛాన్స్ లేదు. ఆయనకు పడని మిగతా ఓట్లలో 0.0037 శాతం ఓటర్లు సముద్రంలో పని చేస్తుండటంతో ఓటు వేయలేకపోయారు. మిగతా వారిలో 0.00003 ఓటర్లు ఓటు వేయలేదు. ఉత్తర కొరియాలో కిమ్‌కు వ్యతిరేకంగా ఎవరూ గొంతెత్తే ప్రసక్తే లేదనే సంగతి తెలిసిందే. ఎన్నికలు దీనికి మినహాయింపేమీ కాదు. అక్కడ ప్రతిపక్షం అనేదే ఉండదు. ఎన్నికల్లో గెలవనందుకు కాదు.. అసలు కిమ్ పార్టీకి పోటీగా బ్యాలెట్ పేపర్లో కూడా మరో పార్టీ పేరు, అభ్యర్థి ఉండరు.
కిమ్, అతడి అనుకూల నేతలు ముందుగానే ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అతడినే ఓటర్లు అంగీకరించడం లేదా తిరస్కరించడం మాత్రమే చేయాలి. అంతేకానీ, మరో పార్టీ నేత పోటీలో ఉండరు. ఈ ఎన్నికల్లో ఎవరైనా ఓటు వేయలేదు అంటే ఆ అభ్యర్థికి నో చెప్పినట్లే అర్థం. ఇలా నో చెప్పే అవకాశం కూడా గతంలో అక్కడ లేదు. 1957 తర్వాత ఇలా నో చెప్పే అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి. ఇక, ఈ ఎన్నికల్లో మొత్తం 687 మంది పోటీ చేయగా, అందరూ గెలిచారు. వీరిలో కార్మికులు, రైతులు, మేధావులు, మిలిటరీ సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధినేతగా ఉన్న కిమ్ 2011లో అధికారం చేపట్టారు. అప్పటినుంచి ఆయనకు అక్కడ ఎదురే లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

