MLA Koninty Manik Rao | జహీరాబాద్, జూలై 6 : స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, డా. బాబు జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పేర్కొన్నారు. ఆదివారం మాజీ ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, పాక్స్ చైర్మన్ మచ్చెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు శివప్ప, యువ నాయకుడు మర్తుజ, దీపక్ అప్పీ, రాథోడ్ భీమ్ రావు నాయక్, మోహన్, అశోక్ రెడ్డి, విజయ్ రాథోడ్, ప్రవీణ్ మెస్సీ తదితరులు పాల్గొన్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు