Shri Mahant Siddheshwara nandagiri | ఝరాసంగం, డిసెంబర్ 3 : భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమని బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతులు 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని.. గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలని పేర్కొన్నారు.
శ్రీదత్త జయంతి సందర్భంగా రెండవ రోజు దత్త యజ్ఞం చండీ యజ్ఞం, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 10:45 గణపతి పూజro ప్రారంభమైన యజ్ఞం పుణ్యాహవచనం, మంటపారాధన, ఆవాహిత దేవపూజ, శ్రీ యంత్రపూజ, శ్రీ చండీ పారాయణం, మహా మంగళహారతితో 3:34 యజ్ఞం పూర్ణాహుతితో ముగిసింది.
అనంతరం ఆశ్రమ పీఠాధిపతులు మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల , వర్గాల సమష్టి కలయిక అని.. దేశంలో వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయని.. అందుకని భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలవబడుతుందన్నారు. యజ్ఞానికి సుమారుగా 116 మంది దంపతులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు హాజరై శ్రీదత్తాత్రేయ స్వామి, పంచ వృక్షాలు, జ్యోతిర్లింగాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయ మాత, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దత్త జయంతి ఉత్సవాలు..
మార్గశిర పౌర్ణమి గురువారం దేశవ్యాప్తంగా దత్త జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దత్త క్షేత్రమైన బర్దిపూర్ భక్తుల రాక కోసం ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. గురువారం దత్త, చండి హోమం పూర్ణాహుతి, స్వామివారికి దూలారోహణం, సాయంత్రం దీపోత్సవం విశ్వ మానవ ధర్మ ప్రచారం సభ నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Shri Siddheshwara Nandagiri

Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా