న్యూఢిల్లీ: కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా(Jyotiraditya Scindia).. బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. సంచార్ సాథీ సేఫ్టీ యాప్‌తో స్నూపింగ్ జరగదు అని చెప్పారు. సైబర్‌సెక్యూర్టీ యాప్‌ను కొత్త డివైస్‌లను ప్రీలోడ్ చేయాలని స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వస్తున్న ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ప్రజల రక్షణ కోసమే ఆ యాప్‌ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు వారికే అధికారాన్ని ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. స్మార్ట్ఫోన్లలో సంచార్ సాధీ యాప్‌ను ఇన్స్టాల్ చేయాలని నవంబర్ 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం టెక్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది.
Union Minister @JM_Scindia replies to the questions asked by member during #QuestionHour in #LokSabha regarding Base Transceiver Stations.@ombirlakota @loksabhaspeaker @LokSabhaSectt#ParliamentWinterSession @MIB_India @DoT_India pic.twitter.com/xbaJrmPXek
— SansadTV (@sansad_tv) December 3, 2025